కర్ణాటక సీఎం సరికొత్త రికార్డు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-fa
Siddaramaiah


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

బెంగళూరు:/ఢిల్లీ.,07జనవరి (హి.స.) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. గతంలో దేవరాజ అరసు (కాంగ్రెస్‌) ఏడు సంవత్సరాల 239 రోజుల రికార్డును సిద్ధరామయ్య బుధవారంతో అధిగమించనున్నారు. దేవరాజ అరసు ముఖ్యమంత్రిగా విరామం లేకుండా కొనసాగగా, సిద్ధరామయ్య 2013-18 వరకు, 2023 నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నారు. అరసు, సిద్ధరామయ్య తర్వాత నిజలింగప్ప (కాంగ్రెస్‌) మాత్రమే ఏడేళ్లకు పైగా సీఎంగా పని చేశారు. తాజా రికార్డుతో పాటు ఆర్థిక మంత్రిగా 16 బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన నేతగా కూడా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. రానున్న మార్చిలోనూ తానే బడ్జెట్‌ ప్రవేశపెడతానని, 2028 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించటం గమనార్హం. ముఖ్యమంత్రిగా ఉన్నా ఆర్థికశాఖ కూడా సిద్ధరామయ్య వద్దే ఉంది. సీఎంగా ఆయన రికార్డు నేపథ్యంలో అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా నాటుకోడి, రాగిముద్ద, బిర్యానీలు పంచి, సంబరాలు చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande