
హైదరాబాద్ , 21 అక్టోబర్ (హి.స.)నగరంలోని గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం భావోద్వేగంతో కూడిన రోజని పేర్కొన్నారు. సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసుల సేవలను మరువలేమన్నారు. అమరుల కుటుంబాల్లో ఏర్పడిన లోటును ఎవరూ భర్తీ చేయలేరని వారి కుటుంబాలలు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి అమరవీరుల
సేవలను స్మరించుకుంటూ రూపొందించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు
, డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్