
హైదరాబాద్ , 21 అక్టోబర్ (హి.స.)ఈ నెల 27 నుంచి ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టనున్నారు. జవహర్నగర్ డంప్ యార్డు తరలించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తారు. డంప్ యార్డుకి వ్యతిరేకంగా ఎల్లుండి బాధితులతో ఎంపీ సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలను ఈటల రాజేందర్ తన పాదయాత్రలో ప్రస్తావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకుని వాటిని సంబంధిత వేదికలపై లేవనెత్తేందుకు ఆయన ఈ పాదయాత్ర చేపట్టనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడటం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి మద్దతు పెరిగే అవకాశం ఉంది. . బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నన్నునారు. ఈటల రాజేందర్ పర్యటనలో ఏయే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తారు, ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వెలుగులోకి వస్తాయన్నది ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ఈ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్