
వికారాబాద్ , 21 అక్టోబర్ (హి.స.)వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీ- బైకు ఢీకొన్న ఘటనలో బుద్లాపూర్ తండా వాసి నేనావత్ రవి (28) మృతిచెందారు. పోలిసుల సమాచారం ప్రకారం, యువకుడు బైకుపై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఢీకొన్న తీవ్రతకు యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించే చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా, ప్రమాదానికి ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్