సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికుల దుర్మరణం
పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో సంభవించింది.
Gas leakGas leak


సంగారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.)

పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో సంభవించింది. జిల్లాలోని

జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలోని గ్లాబా బ్లాక్లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. మృతులను సుదర్శన్, బాలాజీగా గుర్తించినట్లు తెలిసింది. వీరిద్దరూ ఆంధ్రప్రదేశకు చెందిన కార్మికులుగా సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న జిన్నారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పారిశ్రామిక వాడల పరిధిలోని కెమికల్ ఫ్యాక్టరీలలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడంతో కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande