నేరాల రేటును కనిష్ఠ స్థాయికి తగ్గించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.... సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Cm


హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)

దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు తెలంగాణ అనుసరిస్తున్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల (SRPCC) సమన్వయ కమిటీ సదస్సును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసింగ్లో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను వివరించి నేరరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో రాష్ట్రాల మధ్య సమన్వయ అవసరాన్ని నొక్కి చెప్పారు. “ఆయా రాష్ట్రాలు తమ సొంత వనరులు, ప్రయత్నాలతో మాత్రమే నేరరహిత రాష్ట్రాలుగా మార్చడం సాధ్యం కాదు. అందుకు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరం. అత్యంత కీలకమైన ఇలాంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి” అని సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి కోరారు. “దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు, నేరాల రేటును అత్యంత కనిష్ఠ స్థాయికి తగ్గించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయంతో పనిచేసేందుకు పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయండి.

సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఐసీసీసీ (ICCC) వ్యవస్థను సమన్వయం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మనమందరం సమష్టిగా కృషి చేద్దాం” అని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande