
భూపాలపల్లి, 23 అక్టోబర్ (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముఖ్య పట్టణమైన భూపాలపల్లి లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్థానిక ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ..
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన ప్రజలను, యువతను ఆప్యాయంగా పలకరించి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రాధాన్యతపై వారికి మాజీ ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. అనంతరం పట్టణంలోని వార్డులలో పర్యటించి ఇంటింటికి వెళ్లి
ప్రజలను కలిసి ఆయా కుటుంబాల్లోని
పట్టభద్రులతో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించి అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని, తమ ఓటు హక్కును సద్వినియోగం
చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..