
మెదక్ జిల్లా , 26 అక్టోబర్ (హి.స.)
కలెక్టరేట్లోని ఉద్యోగులందరూ నీరు మరియు విద్యుత్ను విధిగా ఆదా చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు.
సోమవారం నాడు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో తాగునీటికి, విద్యుత్కు తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అందువల్ల జిల్లా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అనవసరంగా ఫ్యాన్లు, లైట్లు వెలగకుండా చూసుకోవాలని, నీటిని కూడా అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. నీటి సంరక్షణ చేపట్టి, విద్యుత్ను పొదుపు చేసినప్పుడే ఆ వనరులను భవిష్యత్ తరాలకు అందించగలమని ఆమె పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు