వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడి నిర్వాకం: విద్యార్థిని పట్ల అనుచిత ప్రవర్తనపై కేసు నమోదు
పాఠశాల విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘటన వికారాబాద్ జిల్లాలో తీవ్ర నిరసనలకు దారితీసింది.
Arrest


వికారాబాద్ , 26 అక్టోబర్ (హి.స.)

పాఠశాల విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘటన వికారాబాద్ జిల్లాలో తీవ్ర నిరసనలకు దారితీసింది. పాఠశాల ప్రాంగణంలోనే పదో తరగతి విద్యార్థిని పట్ల సదరు ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులకు తెలిపింది.

సమాచారం అందుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు తరలివచ్చి ఉపాధ్యాయుడి తీరును తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

విద్యాశాఖ అధికారులు కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఉపాధ్యాయుడిని విధి నిర్వహణ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతపై నిరంతరం పర్యవేక్షణ ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande