విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. అశ్వరావుపేట ఎమ్మెల్యే
విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందేందుకు క్రీడలు దోహదపడతాయని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు.
Mla


ఖమ్మం, 27 అక్టోబర్ (హి.స.)

విద్యార్థులలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని కమలాపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలబాలికల జోనల్ స్థాయి క్రీడా పోటీలను మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లో కూడా చురుగ్గా రాణించాలని సూచించారు. ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం చేకూరడంతో పాటు మానసిక ఉల్లాసం మరియు వికాసం కలుగుతాయని తెలిపారు. ఆటల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని, ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande