బాలల రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.. సీనియర్ సివిల్ జడ్జి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలల రక్షణ, హక్కులపై అవగాహన కల్పించేందుకు న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
Judge


జయశంకర్ భూపాలపల్లి, 27 అక్టోబర్ (హి.స.)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలల రక్షణ, హక్కులపై అవగాహన కల్పించేందుకు న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

జాతీయ, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’లో భాగంగా ఈ కార్యక్రమాలను చేపట్టారు.

గణపురం మండలం గాంధీనగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల భద్రతకు ప్రాధాన్యమిచ్చినప్పుడే దేశ భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందని పేర్కొన్నారు. పోక్సో నేరాలను అరికట్టడంతో పాటు పిల్లలను సైబర్ మోసాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

విద్యార్థులు చిన్న వయసు నుంచే తమ హక్కులు, రక్షణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande