ఓటర్ల జాబితా సవరణ అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విపక్షాలు.. బండి సంజయ్
కరీంనగర్లో నవంబర్ 5న భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ‘లోకతంత్ర బచావో – అరాచకత హటావో’ నినాదంతో చేపట్టనున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించడంతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణపై అవగాహన కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్
బండి సంజయ్


కరీంనగర్, 27 అక్టోబర్ (హి.స)

కరీంనగర్లో నవంబర్ 5న భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ‘లోకతంత్ర బచావో – అరాచకత హటావో’ నినాదంతో చేపట్టనున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించడంతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణపై అవగాహన కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.

‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్, విపక్ష పార్టీలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ అపోహలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విదేశీ శక్తులతో కలిసి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు.

దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ కాంగ్రెస్, విపక్ష కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ సంఖ్యలో సుమారు 2.8 కోట్ల మంది మరణించినవారు, మూడు కోట్ల మంది చిరునామాల్లో అందుబాటులో లేనివారు ఉన్నారని వివరించారు. మరో 6.3 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లారని, ఇంకో కోటి మంది పేర్లు రెండు, మూడు చోట్ల ఓటర్ల జాబితాల్లో నమోదయ్యాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande