పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.. లీగల్ సర్వీసెస్ అధికారి
విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని డిప్యూటీ లీగల్ సర్వీసెస్ అధికారి ఎం. శ్రీనివాసరావు సూచించారు.
Legal service


కామారెడ్డి, 27 అక్టోబర్ (హి.స.)

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని డిప్యూటీ లీగల్ సర్వీసెస్ అధికారి ఎం. శ్రీనివాసరావు సూచించారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడుపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.

పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా టచ్ఫోన్లు, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande