ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026–27లో భాగంగా డిసెంబర్లో నిజామాబాద్లో జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నారు.
Collector


నిజామాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026–27లో భాగంగా డిసెంబర్లో నిజామాబాద్లో జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం మాక్లూర్ మండలం దాస్నగర్ సమీపంలోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో ఉన్న కీలభారతి ఇండోర్ స్టేడియంలో సిద్ధం చేస్తున్న వేదికను ఆమె పరిశీలించారు.

క్రీడాకారులకు కల్పించాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులపై అధికారులతో సమీక్షించారు.

ఐదు రోజులపాటు జరగనున్న ఈ జాతీయస్థాయి పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి సదుపాయాలను సమకూర్చాలని కలెక్టర్ సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande