
నిర్మల్, 27 అక్టోబర్ (హి.స.)
నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలం రాజాపూర్ తాండలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భూముల హద్దుల నిర్ధారణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సర్వే చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సర్వే ప్రక్రియలో రైతులకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, వారి సమన్వయంతో పనులు చేపట్టాలని అన్నారు.
సర్వే సమయంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. రైతులను సమన్వయం చేసుకుంటూ భూముల రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే పనులను మరింత సులభతరం చేసి వేగవంతం చేసేందుకు త్వరలో అదనంగా ఆధునిక సర్వే పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సర్వే సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..