రైతు మేళ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు ఎస్పీ
కొడంగల్, 27 అక్టోబర్ (హి.స.) కొడంగల్ నియోజకవర్గంలోని హాకింపేట ఎడ్యుకేషన్ హబ్లో నవంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న రైతు మేళా ఏర్పాట్ల పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో బహిరంగ సభా
Collector


కొడంగల్, 27 అక్టోబర్ (హి.స.)

కొడంగల్ నియోజకవర్గంలోని హాకింపేట ఎడ్యుకేషన్ హబ్లో నవంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న రైతు మేళా ఏర్పాట్ల పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో బహిరంగ సభా స్థలంతో పాటు వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లు, పార్కింగ్ ప్రదేశాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేరా తదితర అధికారులు మంగళవారం పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

రైతు మేళాలో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో సుమారు 200 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, అధునాతన సాగు పద్ధతులు, వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, పంటల సాగులో మెళకువలు వంటి అంశాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నారు. వీటి ద్వారా రైతులకు వ్యవసాయంలో వస్తున్న నూతన మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు, సాగులో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలను వివరించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande