
అమరావతి, 08 అక్టోబర్ (హి.స.)తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఈ రోజు ఏపీ, తెలంగాణలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొనే ఛాన్స్ ఉందని అంచానా వేసింది.
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం కావడం, అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, స్థానిక ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఏపీలో వాతావరణం ఇలా
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు, మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాలో పొడి వాతావరణం ఉండొచ్చని అంచనా వేసింది.
తెలంగాణలో వాతావరణ ఇలాతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నేడు గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా, అక్కడక్కడా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కలివిడి వాతావరణం ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉండటంతో నగరవాసులకు ఉక్కపోత తప్పకపోవచ్చు. అయితే, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడి నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV