రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
Chandrababu


అమరావతి , 01 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దేశ రాజధానిలోని ప్రగతి మైదాన్లో ఉన్న భారత మండపంలో నిర్వహించనున్న రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026లో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

ప్రత్యేకంగా సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి, ఈ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికలపై జరిగే చర్చల్లో సీఎం చంద్రబాబు భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన పెట్టుబడులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక అవకాశాలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.

దాదాపు ఐదు గంటల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. ఈ సమావేశం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో వస్తున్న మార్పులు, కొత్త అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై చర్చించనున్నారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande