దుర్గం చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్రిడ్జ్పై నుంచి దుర్గం చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు.
Water


హైదరాబాద్ , 01 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్రిడ్జ్పై నుంచి దుర్గం చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మృతుడిని మహేశ్గా పోలీసులు గుర్తించారు. ఆయన ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కేబుల్ బ్రిడ్జ్పై ఉన్న సమయంలో మహేశ్ అకస్మాత్తుగా చెరువులోకి దూకినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు సంబంధిత సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీసే చర్యలు చేపట్టారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మహేశ్ వ్యక్తిగత పరిస్థితులు, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande