జనగణనలో ఓబీసీ కులగణన నమోదు చేయాలి - సీఎం రేవంత్ కు కవిత లేఖ
రాబోయే జనగణనలో ఓబీసీల కుల వివరాలతో పాటు ఆదివాసీల మతాన్ని ప్రత్యేక కాలమ్ లో నమోదు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Kavita


హైదరాబాద్, 01 నవంబర్ (హి.స.)

రాబోయే జనగణనలో ఓబీసీల కుల వివరాలతో పాటు ఆదివాసీల మతాన్ని ప్రత్యేక కాలమ్ లో నమోదు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ఆమె బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్లో ఇంటింటి జనగణన ప్రారంభం కానుందని, కాబట్టి ఆలస్యం చేయకుండా అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఓబీసీ కులగణన, ఆదివాసీల మత నమోదు అంశాలపై సభలో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రావాల్సిన ఫలాలు దక్కడం లేదని కవిత అభిప్రాయపడ్డారు. దేశంలో ఓబీసీ జనాభా ఎంత అనే దానిపై అధికారిక గణాంకాలు లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీ సంఘాలు చేస్తున్న ఆందోళనలకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు.

ప్రస్తుత జనగణన ఫారంలో కుల వివరాలు నమోదు చేసే అవకాశం ఉన్నా, ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ లేకపోవడం వల్ల వారిని జనరల్ జాబితాలో కలపాల్సి వస్తోందని వివరించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీల జనాభాను కూడా విడిగా లెక్కించాలని ఆమె డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande