పులివెందులలో వాహనాలకు నిప్పు.. 14 వాహనాలు దగ్ధం
పులివెందులలో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఒక తోట వద్ద నిలిపి ఉంచిన వాహనాలకు నిప్పంటించి పరారయ్యారు.
Fire


పులివెందుల, 01 నవంబర్ (హి.స.)

పులివెందులలో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఒక తోట వద్ద నిలిపి ఉంచిన వాహనాలకు నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటనలో మూడు కార్లు, పది ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయాయి. మొత్తం 14 వాహనాలు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి.

ఉలిమెల్లకు చెందిన మధుసూదన్రెడ్డి తోట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వాహనాలకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మూడు కార్లు, పది బైక్లు, ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. ఘటనకు గల కారణాలు, నిందితుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande