ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. పోస్టుల సంఖ్య 720కి పెంపు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త అందింది.
Ap government


అమరావతి , 10 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త అందింది. గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి ఏపీపీఎస్సీ (APPSC) నేడు సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం పోస్టుల సంఖ్యను 720కి పెంచినట్లు సమాచారం.

గతంలో గ్రూప్-2 కింద 686 పోస్టులతో ప్రకటన వెలువడగా, తాజాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అదనంగా 34 ఖాళీలు చేరాయి. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 720కి చేరింది. మొత్తం 30 కేటగిరీల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల సంఖ్య పెరగడంతో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.

సమగ్ర నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా విద్యార్హతలు, గరిష్ఠ వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, పరీక్షల సరళి, సిలబస్ వంటి అంశాలపై స్పష్టత రానుంది. అలాగే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ, ముగింపు తేదీలను కూడా కమిషన్ వెల్లడించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande