హైదరాబాద్లో ఈ నెల 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్
హైదరాబాద్లో ఈ నెల 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. హైటెక్స్ వేదికగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.
GLOBAL SUMMIT


హైదరాబాద్ , 10 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లో ఈ నెల 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. హైటెక్స్ వేదికగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సుమారు 70 మంది నిపుణులు ఈ సదస్సుకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, వాటి ప్రభావాలపై సమ్మిట్లో ప్రధానంగా చర్చించనున్నట్లు శ్రీధర్బాబు వివరించారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులు, మేధావులు తమ అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు కీలక అంశాలపై చర్చలు జరుపుతారని తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు, దార్శనికతకు అనుగుణంగానే భారత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై విస్తృత చర్చలకు ఈ వేదిక దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులు పాల్గొంటుండటంతో హైదరాబాద్లో జరిగే ఈ సదస్సుపై ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande