సోలార్ ప్లాంట్ పనితీరును పరిశీలించిన కలెక్టర్
ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం నంబాల గ్రామంలోని సోలార్ ప్లాంట్ పనితీరును జిల్లా కలెక్టర్ శ్రీమతి కే హరిత, DRDO దత్తారం, SE ఉత్తం జడే మంగళవారం సందర్శించి సమీక్షించారు
Collector


ఆసిఫాబాద్, 10 నవంబర్ (హి.స.)

ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం నంబాల గ్రామంలోని సోలార్ ప్లాంట్ పనితీరును జిల్లా కలెక్టర్ శ్రీమతి కే హరిత, DRDO దత్తారం, SE ఉత్తం జడే మంగళవారం సందర్శించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో AD శ్రీనివాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు, APM దుర్గయ్య, AEలు, CCలు, TAs, VOAs పాల్గొన్నారు.

రోజుకు 10 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, యూనిట్కు రూ.3.13 ఆదాయం వస్తున్నట్లు అధికారులు వివరించారు. అధికారులు ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ విద్యుత్తు ఉత్పత్తి పెంపుదలకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.పాఠ్యాంశాలతో పాటు మౌలికంగా విద్యాబోధన చేయాలని, ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, వంటగది, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande