
నిజామాబాద్, 10 నవంబర్ (హి.స.)
బోధన్ నుంచి రుద్రూర్ వెళ్లే దారిలో పోషమ్మ గుడి దగ్గర పెద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న భారీ మర్రిచెట్టు ఒక్కసారిగా కూలి, ఆటో మీద పడిపోయింది. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోగా, అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
చెట్టు కూలడంతో రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దాంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు పెద్ద అంతరాయం ఏర్పడింది. రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టు ఇలా ఒక్కసారిగా కూలిపోవడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రుద్రూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆటోలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అటు రోడ్డు మీద పడిన భారీ మర్రిచెట్టును తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..