
హైదరాబాద్ , 10 నవంబర్ (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు పలు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతిపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ఇప్పటికే ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాల ప్రస్తుత పరిస్థితి, అర్హులైన లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలపై సీఎం వివరాలు తెలుసుకోనున్నారు. వివిధ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు.
ముఖ్యంగా పేదలు, మహిళలు, రైతులు, వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సీఎం ఆదేశించే అవకాశముంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్