సిద్దిపేటలో సీఎం సభ ఏర్పాటను పరిశీలించిన మంత్రులు
సిద్దిపేటలో ఈ నెల 19న జరగబోయే సభ కోసం మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ నేడు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, రాకపోకలకు అనువైన చోటు, సభకు సరిపోయే ప్రదేశ
Minister


సిద్దిపేట, 10 నవంబర్ (హి.స.)

సిద్దిపేటలో ఈ నెల 19న జరగబోయే సభ కోసం మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ నేడు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, రాకపోకలకు అనువైన చోటు, సభకు సరిపోయే ప్రదేశం కోసం పలు ప్రాంతాలను తిరిగి చూశారు.

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్లు ఇద్దరు మంత్రులు తెలిపారు. ఈ సభలోనే రాష్ట్రం మొత్తం ఇంటింటా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించబోతున్నారని చెప్పారు.

ఆరు గ్యారెంటీలు, కొత్త సంక్షేమ పథకాలను జనంలోకి బలంగా తీసుకెళ్లడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

ఈ సభలో ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను జనానికి వివరిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు బోనస్, రుణమాఫీ, రైతు భరోసా లాంటి పథకాల వివరాలను సభలో వెల్లడిస్తారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande