
హైదరాబాద్ , 10 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హైదరాబాద్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనుంది. నగరానికి చెందిన పార్టీ కీలక నాయకులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలో పార్టీ పరిస్థితి, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ప్రజల్లోకి వెళ్లి సమస్యలను ప్రస్తావించే అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా నేతల అభిప్రాయాలను కేటీఆర్ తెలుసుకోనున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, భవిష్యత్ రాజకీయ పోరాటానికి నాయకులను సిద్ధం చేయడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్