ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులకు మరో అవకాశం- అదనపు కలెక్టర్
ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చినా గైర్హాజరు కావడం, నివాసం మారడం లాంటి కారణాలతో కొందరి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో చేరలేదని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి. విక్టర్ తెలిపారు.
Collector


కామారెడ్డి, 10 నవంబర్ (హి.స.)

ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చినా గైర్హాజరు కావడం, నివాసం మారడం లాంటి కారణాలతో కొందరి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో చేరలేదని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి. విక్టర్ తెలిపారు.

అర్హులైన ఓటర్లు తుది జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు సంబంధిత బూత్ స్థాయి అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు, ఎన్నికల నమోదు అధికారులను కలిసి నిర్దేశించిన పద్ధతిలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.

ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు చేరని అర్హులైన ఓటర్లకు తుది ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకునేందుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వాడుకుని అర్హులైన ఓటర్లు ఈ నెల 21వ తేదీలోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించి తుది ఓటర్ల జాబితాలో తమ పేర్ల నమోదును నిర్ధారించుకోవాలని అదనపు కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande