సిద్దిపేటలో నేడు మంత్రులు పొన్నం, వివేక్ పర్యటన
సిద్దిపేట జిల్లాలో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు.
Ponnam prabhakar


హైదరాబాద్ , 10 నవంబర్ (హి.స.)

సిద్దిపేట జిల్లాలో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం ఎంపిక, వేదిక నిర్మాణం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించనున్నారు. పార్కింగ్ స్థలాలు, రవాణా సదుపాయాలు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనపై కూడా చర్చించనున్నారు.

సభ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించే అవకాశం ఉంది. సీఎం బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి పెట్టాయి. మంత్రుల పర్యటనతో సభా ఏర్పాట్లకు మరింత వేగం పుంజుకోనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande