రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ నేడు ఢిల్లీలో కలిశారు.
మహేష్ కుమార్ గౌడ్


న్యూఢిల్లీ, 10 నవంబర్ (హి.స.)

కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ నేడు ఢిల్లీలో కలిశారు. హైదరాబాద్లో జరగబోయే భారత్ సమ్మిట్కు రావాలని ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ భేటీ కేవలం సమ్మిట్ ఆహ్వానానికే పరిమితం కాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాల గురించి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు . రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, ఓబీసీ అంశాలు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది . ఓబీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande