
నాగర్ కర్నూల్, 10 నవంబర్ (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం నడింపల్లిలోని కేజీబీవీని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మంగళవారం సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 160 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా 95 మంది మాత్రమే ఉండటంపై ఆరా తీశారు. ఇంటర్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలని సూచించారు.
ప్రహరీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడంతో పాటు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విద్యార్థినులకు ఏఐ కోర్సులపై అవగాహన కల్పించాలని, పదో తరగతిలో మంచి ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు