
రాజన్న సిరిసిల్ల, 10 నవంబర్ (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, నేరాల దర్యాప్తు పరిశీలించడం కోసమే ఈ తనిఖీ చేశారు.
స్టేషన్లో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, వేర్వేరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రతి కేసులో నిబంధనల ప్రకారం సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్కు రకరకాల సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నేరాలను అదుపులో పెట్టేందుకు పెట్రోలింగ్, రాత్రి గస్తీని మరింత పెంచాలని, రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ఎప్పుడూ నిఘా పెట్టాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు