
అమరావతి , 10 నవంబర్ (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2027 సంవత్సరానికి సంబంధించి టీటీడీ ముద్రించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి భక్తులు ఇంటి నుంచే తమకు కావాల్సిన క్యాలెండర్లు, డైరీలను ఆర్డర్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
ఈ మేరకు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి అందుబాటులో ఉన్న క్యాలెండర్లు, డైరీలను బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి భక్తులకు సులభంగా చేరువయ్యేలా ఈ ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.
ఆన్‌లైన్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లోని తితిదే సమాచార కేంద్రాల్లోనూ వీటిని విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌తో పాటు విజయవాడ, చెన్నై, వేలూరు, బెంగళూరు, ఢిల్లీ, ముంబయిలోని సమాచార కేంద్రాల్లో భక్తులు నేరుగా కొనుగోలు చేయవచ్చు.
శ్రీవారి చిత్రాలతో రూపొందించే క్యాలెండర్లు, డైరీలకు భక్తుల్లో ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందుబాటులో ఉండేలా టీటీడీ ఈ ఏర్పాట్లు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్