అధికారులు బాధ్యతతో పనిచేయాలి.. హనుమకొండ జిల్లా కలెక్టర్
గురువారం పరకాల ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి సంయుక్తంగా సమీక్ష నిర్వహించారు.
Collector


పరకాల, 12 నవంబర్ (హి.స.)

గురువారం పరకాల ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి సంయుక్తంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ భూములను కాపాడటానికి గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

భూముల రీ సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని, ఏ పనినీ జాప్యం చేయకుండా అనుకున్న సమయంలోనే ముగించాలని ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులను కారణం లేకుండా పెండింగ్ లో ఉంచవద్దని, ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగానే పరిష్కరించాలని చెప్పారు. ప్రతి అర్జీపై క్షేత్రానికి వెళ్లి విచారణ జరిపి, వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విచారణలో ఏం చేశారో, పరిష్కారం ఏమైందో దరఖాస్తుదారునికి తప్పకుండా తెలియజేయాలని అన్నారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సమయానికి అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande