గోదావరి పుష్కర ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలి.. కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయానికి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ నేడు వెళ్లారు. అక్కడ జరుగుతున్న గుడి పునర్నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో స్వయంగా చూసి అధికారులతో మాట్లాడారు.
Collector


జగిత్యాల్, 12 నవంబర్ (హి.స.)

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయానికి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ నేడు వెళ్లారు. అక్కడ జరుగుతున్న గుడి పునర్నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో స్వయంగా చూసి అధికారులతో మాట్లాడారు.

ముందు ముందు గోదావరి పుష్కరాలు రాబోతుండటంతో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని, అందుకు తగ్గట్టుగానే ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆయన చెప్పారు. స్నాన ఘాట్లు సిద్ధం చేయడం, రోడ్లు బాగు చేయడం, తాగునీరు, మరుగుదొడ్లు, కరెంటు, వాహనాలు నిలిపే స్థలం, వైద్య శిబిరాలు, పోలీసు భద్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.

ఆడవాళ్లు, ముసలివాళ్లు, పిల్లలు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని, గోదావరిలో భక్తులు ఎలాంటి ప్రమాదం లేకుండా స్నానాలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గుడి పనులతో పాటు పుష్కరాల కోసం చేస్తున్న అభివృద్ధి పనులన్నీ నాణ్యతతో, అనుకున్న సమయంలోపే పూర్తి కావాలని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande