రీ సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం వెల్గటూర్ లో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తో కలిసి పరిశీలించారు.
Collector


నిజామాబాద్, 12 నవంబర్ (హి.స.)

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం వెల్గటూర్ లో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తో కలిసి పరిశీలించారు.

ఆధునిక సాంకేతికతతో రోవర్ సాయంతో చేపడుతున్న సర్వే తీరును చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు సగటున 30 ఎకరాల చొప్పున సర్వే పూర్తి చేయాలని సూచించిన కలెక్టర్, అవసరమైతే అదనపు రోవర్ యంత్రాలను సమకూరుస్తామని తెలిపారు.

సర్వేకు ముందే రైతులకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే కొలతలు వేయాలని స్పష్టం చేశారు. హద్దులు, ప్రభుత్వ భూములు, పట్టా భూముల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, సర్వే తర్వాత గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. రీ సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande