నాణ్యతతోనే మార్కెట్లో మనుగడ.. సింగరేణి జి ఎం డి
పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో నేడు బొగ్గు నాణ్యత వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఏరియా జీఎం డి.లలిత్ కుమార్ మాట్లాడుతూ, వినియోగదారులకు మంచి నాణ్యత కలిగిన బొగ్గు అందించడమే సింగరేణి ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
Gmd


పెద్దపల్లి, 12 నవంబర్ (హి.స.)

పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో నేడు బొగ్గు నాణ్యత వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఏరియా జీఎం డి.లలిత్ కుమార్ మాట్లాడుతూ, వినియోగదారులకు మంచి నాణ్యత కలిగిన బొగ్గు అందించడమే సింగరేణి ముఖ్య ఉద్దేశమని చెప్పారు. విద్యుత్ కేంద్రాలకు నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గ బొగ్గునే పంపిస్తున్నామని తెలిపారు.

బొగ్గు తవ్వేటప్పుడు దానిలో కలిసే రాళ్లు, మట్టి, షేల్ పొరలను పక్కకు తీసేసి మంచి గ్రేడ్ బొగ్గు మాత్రమే సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. జీడీకే-2ఏ భూగర్భ గనిలో షేల్ పొరలను వేరు చేయడం వల్ల నాణ్యత పెరిగిందని వివరించారు. జీడీకే-1 ఇంక్లైన్ నుంచి మంచి బొగ్గు వస్తుండటంతో స్థానిక వినియోగదారులు రోజుకు దాదాపు 500 టన్నుల చొప్పున కొంటున్నారని తెలిపారు.

ప్రైవేటు బొగ్గు సంస్థలతో పోటీ పెరుగుతున్న ఈ రోజుల్లో నాణ్యత ఉంటేనే వినియోగదారులు నిలబడతారని అన్నారు. ప్రతి ఉద్యోగి నాణ్యతపై దృష్టి పెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తర్వాత క్వాలిటీ పతాకాన్ని ఆవిష్కరించి, నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన కరపత్రాలను ఉద్యోగులకు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande