
మంచిర్యాల, 12 నవంబర్ (హి.స.)
మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులోని స్థానిక సబ్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని తెలంగాణ విద్యుత్ శాఖ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చెన్నూరు ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజల విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ, నాణ్యమైన సరఫరాతో పాటు సంస్థ ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
ఎలినీనో ప్రభావం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే విద్యుత్ సమస్యలను ఎదుర్కోవడానికి గాను తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ బి.రాజన్న, ఏఏఓ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..