12వ పీఆర్సీ కమిషన్కు అదనపు సిబ్బంది నియామకం
వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కార్యాలయంలో పరిపాలనా కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సిబ్బందిని నియమించింది.
12వ పీఆర్సీ కమిషన్కు అదనపు సిబ్బంది నియామకం


అమరావతి , 13 నవంబర్ (హి.స.)12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కార్యాలయంలో పరిపాలనా కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సిబ్బందిని నియమించింది. ఈ మేరకు ఇద్దరు రిటైర్డ్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రిటైర్డ్ అసిస్టెంట్ సెక్రటరీ పీబీవీఎస్ఎస్ శివకుమార్ను పీఆర్సీ కమిషనర్కు ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. మరో రిటైర్డ్ అసిస్టెంట్ సెక్రటరీ బి. వెంకటేశ్వరరావును పీఆర్సీ కార్యదర్శికి పర్సనల్ అసిస్టెంట్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిద్దరి నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు కొనసాగనున్నాయి.

ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ 2026 నవంబర్ 12న జీఓ ఆర్టీ నంబర్ 3153ను విడుదల చేసింది. పీఆర్సీ కార్యాలయంలో రోజువారీ పరిపాలనా పనులు, అధికారిక వ్యవహారాలు వేగంగా పూర్తిచేయడంతో పాటు కమిషన్ కార్యకలాపాలకు అవసరమైన సహకారం అందించేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

12వ పీఆర్సీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. వేతన సవరణ సంఘం కార్యకలాపాలు మరింత సజావుగా సాగేందుకు ఈ అదనపు నియామకాలు ఉపయోగపడనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande