ఏపీలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Vote


అమరావతి , 13 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడత ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. అనంతరం రెండో విడత ఎన్నికలను ఈ నెల 29న నిర్వహిస్తారు. ఈ విడతలోనూ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

ఇక మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. మూడు విడతల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల కోసం ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల నియమావళి అమలుపై అధికారులు దృష్టి సారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande