చేవెళ్ల సమీపంలో ఆర్మీ వాహనం బోల్తా.. ఎనిమిది మంది జవాన్లకు గాయాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ దగ్గర శుక్రవారం ఆర్మీ వాహనం బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు
యాక్సిడెంట్


హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ దగ్గర శుక్రవారం ఆర్మీ వాహనం బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గోల్కొండలోని ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్ లో ఉన్న శిక్షణ కేంద్రానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాహనంలో మొత్తం 14 మంది జవాన్లు ప్రయాణిస్తుండగా, అందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా గోల్కొండ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande