
ఆసిఫాబాద్, 13 నవంబర్ (హి.స.)
ఈనెల 16న సోమవారం సాధారణ ప్రజావాణితోపాటు ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్టు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత వెల్లడించారు.
జిల్లాలోని బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె. హరిత కోరారు. పిల్లల వివరాల గోప్యతను పాటిస్తూనే సంబంధిత శాఖల అధికారులతో సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.
పిల్లల హక్కుల ఉల్లంఘన, భద్రత, విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి సమస్యలపై బాలబాలికల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఈ నెల 16న సోమవారం ఉదయం 10:30 గంటలకు సాధారణ ప్రజావాణితో పాటు ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..