రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హరీష్ రావు
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నేడు ట్రక్ పార్క్ వద్ద నిరసనకు దిగారు.
Harish Rao


హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)

కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నేడు ట్రక్ పార్క్ వద్ద నిరసనకు దిగారు.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆందోళనను మరింత ఉధృతం చేస్తుందని హరీశ్రావు హెచ్చరించారు. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్రెడ్డి కన్ను ఏ భూమిపై పడినా దాన్ని విక్రయించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటలు వింటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్క ఇంచు భూమి కూడా అమ్మబోమని గతంలో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ భూముల అమ్మకాన్నే ప్రధాన పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూములను విక్రయించడమే పాలనగా భావిస్తున్నారా, ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అమ్మకానికి పెట్టడమే లక్ష్యమా అంటూ ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande