హైదరాబాద్ కొత్త సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ భగవత్
హైదరాబాద్కు కొత్త పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
Cp


హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)

హైదరాబాద్కు కొత్త పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం అందుకున్నారు. అనంతరం గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసి, ప్రస్తుతం ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బదిలీపై వెళ్తున్న వీసీ సజ్జనార్కు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సజ్జనార్కు వివిధ జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది అపూర్వ రీతిలో గౌరవ వందనం సమర్పించారు. కమిషనరేట్ కార్యాలయం ప్రధాన గేటు వరకు వచ్చి మరీ ఉన్నతాధికారులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. మరోవైపు, నూతన సీపీగా బాధ్యతలు చేపట్టిన మహేష్ భగవత్ మాట్లాడుతూ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీనియర్ అధికారుల సమన్వయంతో నేరాల నియంత్రణే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande