
ఖమ్మం, 13 నవంబర్ (హి.స.)
ఖమ్మం రూరల్ మండలం అరేంపుల వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా బయటపడిందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా డీసీఎం వాహనంలో 33 గోవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 33 గోవులతో పాటు అక్రమ రవాణాకు వాడిన డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నలుగురు నిందితులను తదుపరి విచారణ కోసం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు