
సూర్యాపేట, 13 నవంబర్ (హి.స.)
అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ పథకం ద్వారా అండగా నిలుస్తోందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ, చిలుకూరు, మునగాల, నడిగూడెం, మోతే, అనంతగిరి మండలాలకు చెందిన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో కొత్తగా 4,674 మందికి పింఛన్లు మంజూరయ్యాయని, దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 37,120కు చేరిందని తెలిపారు. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ బాధితులు, పైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున, వికలాంగులకు రూ.4,016 చొప్పున పింఛన్లు అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు