డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ.. మంత్రి పొంగులేటి
విద్యార్థులు చెడు స్నేహాలు, మాదక ద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.
Minister


ఖమ్మం, 13 నవంబర్ (హి.స.)

విద్యార్థులు చెడు స్నేహాలు, మాదక ద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

ఉపాధ్యాయులు సైతం విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తాము కష్టపడైనా పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నదే తల్లిదండ్రుల ఆకాంక్ష అని గుర్తుచేశారు.

ఎక్కువ మంది విద్యార్థులు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారని, తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల భవిష్యత్తు కోసం చదివిస్తున్నారని అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

విద్యార్థుల ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే ఉపాధ్యాయులు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు, పోలీసు, ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యను ఒక్క ప్రభుత్వ శాఖతోనో, పోలీసు శాఖతోనో నియంత్రించడం సాధ్యం కాదన్నారు. మాదక ద్రవ్యాల ప్రభావం చిన్నారుల నుంచి పెద్దవారి వరకు విస్తరిస్తోందని, దీనివల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ వ్యవస్థ, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలుగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుమారు 8 వేల కేసులు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా, దాడులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్కు పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వాటితో సంబంధం ఉన్న నెట్వర్క్పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇంత మంచి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సుమారు 1,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్కు అలవాటు పడితే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం మనిషి ప్రాణాలకే ముప్పుగా మారుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande