
హైదరాబాద్ , 13 నవంబర్ (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు రాత్రి హైదరాబాద్కు రానున్నారు. నగరంలోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో ఆయన బస చేయనున్నారు. రేపు రోజంతా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు.
రేపు ఉదయం 11 గంటలకు గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారి పని పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక భద్రత, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం నిర్వహించనున్న భారత్ సమ్మిట్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో దేశానికి సంబంధించిన పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
రాహుల్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నాయకులు దృష్టి సారించారు. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత రేపు రాత్రి 8 గంటలకు రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి బయలుదేరనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్