శబరిమల భక్తులకు గుడ్న్యూస్.. నేటి నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
BAIRABI-SAIRANG RAIL LINE TUNNEL.


అమరావతి , 13 నవంబర్ (హి.స.)

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి మొత్తం 54 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. శబరిమల యాత్ర సీజన్లో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా ఈ ఏర్పాట్లు చేపట్టింది.

ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్లు నేటి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లతో పాటు అధికారిక ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ ద్వారా టికెట్లు రిజర్వు చేసుకోవచ్చు. యాత్రకు ముందుగానే ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకునే భక్తులు అందుబాటులో ఉన్న తేదీలు, రైళ్ల వివరాలను పరిశీలించి టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి.

ప్రతి ఏడాది శబరిమల యాత్ర సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కేరళకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అదనపు రైళ్ల ఏర్పాటు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. రద్దీని నియంత్రించడంతో పాటు భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రత్యేక రైళ్ల ప్రధాన ఉద్దేశం.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande